President’s Message

  • Home
  • President’s Message

PRESIDENT MESSAGE

సాదర నమస్కారం.

ఆప్కో తెలుగు సమితి 2024 సంవత్సరానికి నూతన అధ్యక్షురాలిగా, సంస్థకు సేవ చేసే గౌరవం నాకు
ఇచ్చినందుకు మా కార్యవర్గానికి, ట్రస్టీ లకు, కమ్యూనిటీ నాయకులకి, వాలంటీర్లకి, స్పాన్సర్లకి మరియుఆప్కోకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు
తెలియచేసుకుంటున్నాను.

మా కమిటీ కొలంబస్ తెలుగు వారి కోసం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల తో మీ ముందుకు వస్తున్నదిఅమెరికా లో పుట్టి పెరిగిన మన భావి తరం యువతకి మన తెలుగు సంస్కృతి, సాంప్రదాయవిలువలు తెలుపుతూ, ఆప్కో కార్యక్రమాలలో వారిని భాగస్వాములను చేస్తున్నాము.

2024 లక్ష్యాలు:

• సంస్థకి వచ్చిన విరళాలని పొదుపుగా ఆప్కో పురోగతికి ఉపయోగించటం.
• సాధ్యమైనన్ని సేవా కార్యక్రమాలు చేయటం.
• ఆప్కో వెబ్సైటు / యాప్ పూర్తి చేయటం.
• యువతను సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా చేసి మన సంస్కృతి మరియు
సాంప్రదాయాలను పాటించేలా ప్రోత్సహించటం.
• ఎక్కువ మంది సభ్యులు, స్పాన్సర్లు మరియు దాతలను ఆప్కో కుటుంబం లో చేర్చడం.

సభ్యత్వాలు, స్పాన్సర్ షిప్ లు, విరాళాలు, స్వచ్ఛంద సేవ మరియు కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ నిరంతర మద్దతు మాకు ఉంటుందని ఆశిస్తున్నాను. మీ సలహాలు లేదా ఆలోచనలు ఆప్కో
అభివృద్ధి కి ఉపయోగపడుతాయి అనుకుంటే మాకు తెలియచేయగలరు.

ఈ ప్రయాణం లో నేను, మా కార్యవర్గ సభ్యులందరమూ అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాము

మీ అందరి సహకారంతో మన ఆప్కో ను ముందుకు తీసుకువెళ్లగలనని నమ్ముతూ…

మీ,
ఆంధ్రవాణి గద్దె